Tuesday, April 5, 2022
HomePoliticsLatest Newsఈ 12 సీట్లపైనే రేవంత్ ఫుల్ ఫోకస్..?

ఈ 12 సీట్లపైనే రేవంత్ ఫుల్ ఫోకస్..?




తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. బలహీనంగా ఉన్న చోట పార్టీ బలోపేతానికి ఏం చేయాలన్న దానిపై రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తున్నా రేవంత్.. అధికారంలోకి వచ్చేందుకు ఇంకా కేవలం డజన్ సీట్లను గెలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్నారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇంతకీ కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవబోతుంది..? రేవంత్ మాస్టర్ ప్లాన్ ఏంటి..?

పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన పార్టీని రేసులోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. పార్టీని మునుపటిరీతిలో యాక్టివ్ చేశారు. నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో మళ్ళీ అధికారంపై ఆశలు రేపడానికి కారణం రేవంత్ నాయకత్వమే అన్నది అందరూ అంగీకరించే విషయం. కాని కొన్ని రోజులుగా లుకలుకలు, విబేధాలతో మళ్ళీ పార్టీ డీలా పడింది. దీంతో వాటిని చక్కదిద్దుతునే…పార్టీని అధికారంలో నిలపడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు రేవంత్. పార్టీని పవర్ లోకి తీసుకురావాలంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలో సూచించారు. నియోజకవర్గంలో ఐదు మండలాల్లో పార్టీ స్ట్రాంగ్ గా ఉంటే ఎమ్మెల్యే సీట్ కాంగ్రెస్ లో ఖాతాలో పడటం ఖాయమని చెప్పారు. 35 మండలాల్లో బలంగా ఉంటే లోక్ సభ సీట్ ఖాయమన్నారు.

ఈ లెక్కన ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ 48 సీట్లు పక్కాగా గెలుస్తుందని రేవంత్ ధీమాగా ఉన్నారట. మొత్తం 119 నియోజకవర్గాలున్నతెలంగాణలో ఏదేని పార్టీ పవర్ లోకి రావాలంటే 60 సీట్లు రావాలి. కాని కాంగ్రెస్ కు మాత్రం 48 సీట్లు వస్తాయని భావిస్తున్నారట. అందుకే ఇంకో డజన్ సీట్లను గెలుచుకోవడంపై రేవంత్ ఫోకస్ పెడుతున్నారట. ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఇంకొన్ని చోట్ల గట్టిగా ఫోకస్ చేస్తే ఆ 12 సీట్లను గెలుచుకోవడం అసాధ్యమేమి కాదని టీపీసీసీ చీఫ్ భావిస్తున్నారట.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments