Saturday, January 22, 2022
HomePoliticsరేవంత్ సవాల్ కు తోక ముడిచిన కేటీఆర్..!

రేవంత్ సవాల్ కు తోక ముడిచిన కేటీఆర్..!

రైతు సమస్యల పై మంత్రి కేటీఆర్ సవాల్ ను స్వీకరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను సవాల్ కు సిద్దమని ప్రకటించారు. అందులో భాగంగా ఓ యుట్యుబ్ ఛానెల్ స్టూడియో వేదికగా సాయంత్రం 5గంటలకు కేటీఆర్ ను ఆహ్వానించారు రేవంత్. అయితే అదే సమయానికి మంత్రి కేటీఆర్ ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో చిట్ చాట్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే రేవంత్ సవాల్ కు తోక ముడిచే ఆస్క్ కేటీఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి.

నిజంగా రైతులకు టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో ఆదుకున్నట్లు అయితే ఎందుకు రైతు సమస్యలపై సవాల్ కు తోక ముడిచారని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సవాల్ ను డైవర్ట్ చేసేందుకు..ఆస్క్ కేటీఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మండిపడుతున్నారు. సవాల్ ను స్వీకరిస్తే ఎక్కడ టీఆర్ఎస్ బాగోతం బయట పడుతుందోనని ఆయన ఈ సవాల్ కు డుమ్మా కొట్టారని విమర్శిస్తున్నారు. ప్రతిసారి సవాల్ విసిరి.. తోక ముడవడం కేటీఆర్ కు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments