సిని’మా’ లో జోకర్లంటూ ఆర్జీవీ ట్వీట్-మంచు వారి పంచ్ అదుర్స్

ఇటీవల జరిగిన ‘మా’ఎన్నికలు వాడివేడిగా జరిగిన సంగతి తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి. నటీ, నటులు ప్రత్యర్థి ప్యానల్ పై పేల్చిన మాటల తూటాలతో ‘మా’ ఎన్నికల హీట్ మరింత పెరిగింది.

కాగా, ప్రతీ విషయంపై స్పందిస్తూ వివాదాల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ కొత్తగా ఎన్నుకోబడిన ‘మా’పై ఇంకా స్పందించలేదని అనుకుంటుండగానే ట్వీట్ చేయనే చేశాడు. టోటల్ గా జోకర్లతో సిని’మా’ నిండిపోయిందని తనదైన శైలిలో ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఈ ట్వీట్ పై మా ప్రెసిడెంట్ సోదరుడు మంచు మనోజ్ రియాక్ట్ అయ్యాడు. ‘మీరు అందులో రింగ్ మాస్ట‌ర్ స‌ర్’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో మంచు వారి పంచ్ అదిరింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు