Saturday, January 22, 2022
HomePoliticsLatest News'ఆర్ ఆర్ ఆర్' రివ్యూ

‘ఆర్ ఆర్ ఆర్’ రివ్యూ

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కాని కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. కరోనా మళ్ళీ పంజా విసరడంతో రిలీజ్ పై వెనక్కి తగ్గారు మేకర్స్. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల చేయడం సరైంది కాదని భావించి వెనక్కి తగ్గారు.

కరోనా పరిస్థితి సద్డుమణగ్గానే ‘ఆర్ ఆర్ ఆర్’ ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే తాజాగా ఈ సినిమా కు సంబంధించి ఓ కీలక ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం సెన్సార్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమాకు ఏం సర్టిఫికేట్ ఇచ్చారో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం సెన్సార్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ విమర్శకుడు, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ సెన్సార్ రివ్యూను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సెన్సార్ రిపోర్ట్ మైండ్ బ్లోయింగ్ …జూనియర్ ఎన్టీఆర్ పాత్ర అదుర్స్ అంటూ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments