Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsసల్మాన్ ఖాన్ తో సమంత డేటింగ్..?

సల్మాన్ ఖాన్ తో సమంత డేటింగ్..?

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై నిత్యం ఎదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. పలానా హీరోయిన్ తో ఆయన ఎఫైర్ నడుపుతున్నాడని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆయన గురించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సల్మాన్ ఖాన్ కెరీర్ మొదట్లో సంగీత బిజ్లానీతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఆమెతో చాలా కాలం లవ్ ట్రాక్ నడిపాడు. ఆ తరువాత ఐశ్వర్యరాయ్, కత్రీనా కైఫ్, ఇలియా వాంటర్ లతో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఆయన మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమెరికా నటి, మోడల్ అయిన సమంత లాక్ఉడ్ తో కండల వీరుడు ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిపై సమంత స్పందించింది. సల్మాన్ ఖాన్ అంటే తనకెంతో ఇష్టమని.. ఆయన చాలా మంచి వాడని ప్రశంసించింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ముంబైలోని సల్మాన్ ఫామ్ హౌస్ లో ఆయన్ను కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించింది. అయితే డేటింగ్ లో ఉన్నారన్న వార్తలను మాత్రం ఆమె తోసిపుచ్చింది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments