మహేష్ బాబు హీరోగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ” సర్కారు వారి పాట” సినిమా తాజాగా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో మహానటి “కీర్తి సురేష్ ” నటించింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత వచ్చిన సినిమా కావడంతో ‘ సర్కారు వారి పాట’ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో చూద్దాం.
మహి ( మహేష్ బాబు )వడ్డీ వ్యాపారిగా కనిపిస్తాడు. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వలన డబ్బును సంపాదించాలని చాలా ఫోకస్డ్ గా ఉంటాడు. ఎవరికైనా అప్పు ఇస్తే , దానిని వసూళ్లు చేసేందుకు ఎంతవరకైనా వెళ్తాడు. అయితే, మహి కొన్ని కారణాల వలన మహేష్ యూఎస్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడే ( కళావతి ) పరిచయం అవుతుంది. కళావతి తన చదువుల కోసం మహి నుంచి చాలా అప్పు చేస్తుంది. ఈ క్రమంలోనే కళావతి ప్రేమలో పడతాడు మహి. దాంతో ఆమె ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేస్తూ ఉంటాడు. మరోవైపు, బిజినెస్ మెన్ రాజేంద్ర ప్రసాద్ ( సముద్రఖని ) తో మహికి గొడవ. చిన్న గొడవ పెద్ద వివాదానికి దారి తీస్తుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ కారణంగా రాజేంద్ర నాథ్ పెద్ద స్కాం ను మహి బయట పెడుతాడు. ఇంతకీ మహేష్ యూఎస్ కి ఎందుకు వెళ్ళాలసి వచ్చింది..? రాజేంద్రనాథ్ ఎవరు..? అతనితో ఎందుకు గొడవ అవుతుందనేది ఈ సినిమా కథ.
నటీ నటుల నటన
ఈ సినిమాలో మహేష్ బాబు నటన అద్భుతః అనొచ్చు. రెండున్నరేళ్ళ తరువాత తెరపై కనిపించి తన ఫెర్ఫామెన్స్ తో విజిల్స్ వేయించాడు. మహేష్ బాబు మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడని చెప్పొచ్చు. తన కామెడి టైమింగ్ అద్భుతంగా అనిపిస్తుంది. మహేష్ బాబు , కీర్తి సురేష్ ల జోడీ ఈ సినిమాలో మెప్పించారు. కళావతి పాటకు చేసిన డ్యాన్స్ కన్నుల విందు చేసింది. కీర్తి సురేష్ కు స్క్రీన్ స్పెస్ తక్కువే ఉనప్పటికీ ఉన్నంతలో మెప్పించిందని చెప్పొచ్చు. మహేష్ మాత్రం మాస్ స్టెప్పులతో అదరహో అనిపించాడు. వెన్నెల కిషోర్ , మహేష్ బాబుల కామెడి అల్టిమేట్ అని చెప్పొచ్చు. విలన్ గా ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి పేరు దక్కించుకున్న సముద్రఖని ఈ సినిమా తో మరోసారి మెప్పించాడు.
కళావతి పాట మహేష్ బాబు అభిమానులకు విపరీతంగా నచ్చడంతో.. థియేటర్లలో ఈ పాట సమయంలో సందడి ఎక్కువగా కనిపిస్తుంది. మహేష్ బాబు స్టైల్ కు తగ్గట్టుగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అభిమణులతో ఈలలు వేయించాడు. యాక్షన్ సన్నివేశాల్లో సినిమాతోగ్రఫీ చాలా బాగుందని చెప్పొచ్చు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ద్వారా దర్శకుడు పరుశురాం మరో మెట్టు ఎక్కినట్టుగా అనిపిస్తుంది.
సర్కారు వారి పాట ప్లస్ పాయింట్స్ :
మహేష్ బాబు ,
డైలాగ్స్,
కీర్తి సురేష్ ,
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్
ఎడిటింగ్ లో చిన్న , చిన్న లోపాలు ,
సెకండ్ హాఫ్ ,
క్లైమాక్స్.
ఓవరాల్ గా ఈ సినిమాతో మహేష్ బాబు అభిమానులకు పెద్ద పండగేనని చెప్పొచ్చు.