మహేష్ బాబు హీరోగా , దర్శకుడు పరుశురాం తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘సర్కారు వారి పాట’ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు పరుశురాం మంచి రైటర్ కావడంతో డైలాగ్ లతో కుమ్మేశాడు. మహేష్ బాబు క్యారెక్టర్ ను ఎలివేట్ చేసేలా ఈ డైలాగ్ లు ఉన్నాయి. అందులోనే పంచ్ , వ్యంగ్యం రెండూ ఉండటం విశేషం.
ఈ మధ్య కాలంలో ఓ ట్రైలర్ లో ఇన్ని డైలాగ్ లు ఉండటం ఇదే మొదటిసారి.