Tuesday, April 5, 2022
HomePoliticsLatest Newsకేసీఆర్ కు షాక్- జాతీయ రాజకీయాల్లోకి కేటీఆర్...?

కేసీఆర్ కు షాక్- జాతీయ రాజకీయాల్లోకి కేటీఆర్…?




తెలంగాణ మంత్రి కేటీఆర్ మనస్సు జాతీయ రాజకీయాల వైపు మళ్ళుతున్నట్లు కనిపిస్తోంది. జాతీయ మీడియా ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందో వాటిపైనే కేటీఆర్ స్పందిస్తూ మైలేజ్ పొందుతున్నారు. ఏ అంశాల్లో తలదూర్చితే ఎక్కువ హైలెట్ అవుతారో సరిగ్గా వాటిపైనే కేటీఆర్ ఫోకస్ చేస్తున్నట్లుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ కు చెందిన చెస్ క్రీడాకారిణి మల్లికాహండా అక్కడి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇటీవల విమర్శలు చేసింది. తాను ఫిజికల్ ఛాలెంజ్‌డ్ అయినా ప్రతిభతో పతకాలు సాధిస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చి విస్మరించారని సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. పంజాబ్ సర్కార్ ఆదుకోకపోయిన తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

దీంతో ఆమెను హైదరాబాద్ కు పిలిపించి ఆర్థిక సాయం అందజేశారు. పంజాబ్ సర్కార్ విస్మరించిన చెస్ క్రీడాకారిణి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదుకున్నారంటూ జాతీయ మీడియాలో హైలెట్ అయింది. సోషల్ మీడియా కూడా బాగానే ప్రమోట్ చేసింది. అయితే సహాయం మాట అటుంచితే కేటీఆర్ ఉద్దేశ్యం మరొకటి అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. తెలంగాణలో ప్రభుత్వ ఆదరణ లేక ఎంతోమంది క్రీడాకారులు నలిగిపోతున్నారు. అలాంటి వారిని పట్టించుకోని కేటీఆర్.. ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులను ఆదుకోవడంలో మతలబు ఏంటని చర్చించుకుంటున్నారు. రాష్ట్రానికి సంబంధం లేని వ్యవహరాలలో తలదూర్చి జాతీయ స్థాయి మీడియాలో హైలెట్ కావడానికి ఇదంతా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రాజకీయ నేతలు చేసే సహాయం వెనక అంతరంగం మరొకటి ఉంటుందనే అభిప్రాయాలు మరోసారి వ్యక్తం అవుతున్నాయి.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments