Saturday, January 22, 2022
HomeMovie‘డియర్ సైనా..’ అంటూ లేఖ- క్షమాపణలు కోరిన సిద్ధార్థ్

‘డియర్ సైనా..’ అంటూ లేఖ- క్షమాపణలు కోరిన సిద్ధార్థ్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఎట్టకేలకు ఆయన వెనక్కి తగ్గారు. సైనాకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు. డియర్ సైనా అంటూ పేర్కొంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో లేఖను పోస్ట్ చేశాడు.

ఎవగించుకునే జోక్ చేశానని, అందుకుగాను తనను క్షమించాలని కోరారు సిద్దార్. మీ ట్వీట్ కు తాను రియాక్ట్ అయిన విధానం సరైంది కాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అయితే , తనకు మహిలలంటే గౌరవం లేదని వస్తోన్న విమర్శలపై స్పందిస్తూ.. మహిళలను తాను గౌరవిస్తానని పేర్కొన్నాడు. తాను చేసిన ట్వీట్ లో లింగ వివక్ష లేదని, మీరు మహిళా కాబట్టే మీపై దాడి చేయాలన్న ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలుకుదామని పేర్కొన్నాడు సిద్దార్థ్. చివరగా, మీరెప్పుడూ నా చాంపియనేనని ముగించాడు.

ఇటీవల పంజాబ్ లో ప్రధాని మోడీని రైతులు అడ్డగించిన సంగతి తెలిసిందే. ఈ భద్రత వైఫల్యంపై సైనా నెహ్వాల్ మోదీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. దీనికి రిప్లై ఇస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేస్తూ వాడిన భాషపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమమయ్యాయి. ఈ క్రమంలోనే సిద్దార్థ్ తాను చేసిన ట్వీట్ కు క్షమాపణలు కోరుతూ లేఖ విడుదల చేశాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments