సినీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాగ చైతన్య – సమంత, ధనుష్ – ఐశ్వర్య లు విడాకులు తీస్కోగా.. తాజాగా మరో జంట విడాకులకు దరఖాస్తు చేసుకుంది.
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్, తన భార్య సీమా ఖాన్ కు విడాకులు ఇవ్వబోతున్నాడు. పెళ్ళైన 24 ఏళ్ల తరువాత వీరిద్దరూ డివోర్స్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముంబై ఫ్యామిలీ కోర్టులో సోహైల్ ఖాన్ –సీమా ఖాన్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్న సోహైల్ ఖాన్, సీమా ఖాన్ లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాని సడెన్ గా విడాకులకు దరఖాస్తు చేసుకునే సరికి బీ టౌన్ అంత షాక్ అయింది. వీరు ఎందుకు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారో తెలియదు కాని, కొన్నాళ్ళుగా విడివిడిగా ఉంటున్నారు. గతంలోనే విడాకుల వార్తలు వచ్చినా ఖండించారు.
తమకు తమ పిల్లల భావిష్యతే ముఖ్యమని విడాకులు తీసుకునే ప్రసక్తే లేదని… ఇప్పుడు మాత్రం విడాకులకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.