Wednesday, June 15, 2022
HomePoliticsLatest Newsబీఆర్ఎస్ లోకి సోనుసూద్ ...?

బీఆర్ఎస్ లోకి సోనుసూద్ …?




జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఫ్లాట్ ఫార్మ్ రెడీ చేసుకుంటున్న కేసీఆర్ వ్యూహం ఏంటి..?ఎవరెవరు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొనున్నారు..? సోనుసూద్ ను బీఆర్ఎస్ లోకి లాగేసి..పలు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించనున్నారా..? టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త పీకే రోల్ బీఆర్ఎస్ లో ఎలా ఉండనుంది..?

జాతీయ రాజకీయల్లో కీలక భూమిక పోషించాలని కేసీఆర్ అందుకు తగ్గ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే దేశానికి కావాల్సిన అభివృద్ధి ఎజెండాపై చర్చించిన కేసీఆర్.. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ లతో భేటీ కూడా అయినట్లుగా తెలుస్తోంది. బీజేపీయేతర, కాంగ్రెస్యేతర కూటమి అవసరమని ఆయన బలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఏర్పాటుపై కేసీఆర్ కు పీకే రోడ్ మ్యాప్ రెడీ చేసి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా బీఆర్ఎస్ మొదటి సభను జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ సభతోనే పార్టీలోకి చేరికలు ఉంటే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా కరోనా వారియర్ సోనుసూద్ ను బీఆర్ఎస్ లోకి చేర్చుకుంటే బాగా అడ్వాంటేజ్ అవుతుందని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. అంతేకాకుండా తెలుగు, తమిళ్ , కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులతో పార్టీ ఏర్పాటు, చేరికలపై చర్చలు కూడా జరుగుతున్నట్లుగా అభిప్రయపడుతున్నారు. ఆ మధ్య ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన తమిళ్ హీరో విజయ్ కూడా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని టాక్. గతంలో వీరి కలయిక సమయంలో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు.

ఇక, బీఆర్ఎస్ ఏర్పాటులో తెరవెనక ఉంటూ సలహాలు ఇస్తోన్న ప్రశాంత్ కిషోర్ కు పార్టీలో కీలక పదవి అప్పగించే అవకాశం ఉంది. ఆయనకు బీఆర్ఎస్ జాతీయ కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉంది. మొత్తానికి అయితే…పార్టీలోకి చేరికలపై కేసీఆర్ ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments