కాంట్రవర్సరీ క్వీన్ శ్రీరెడ్డి ఎప్పటికప్పుడు వార్తల్లోకెక్కుతునే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీరెడ్డి ప్రస్తుతం తన యూట్యుబ్ ఛానెల్ లో పలు వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ.. తన అందాలను ప్రదర్శిస్తూ సెగలు రేపుతోంది.
ఇటీవల పబ్ లో మెగా డాటర్ నిహారిక పట్టుబడటంపై నాగబాబును ఎకిపారేసింది శ్రీరెడ్డి. జనాలకు నీతులు బోధించే నాగబాబు తన కూతురికి మాత్రం క్రమశిక్షణను నేర్పించలేకపోయారని ఫైర్ అయింది. ఎదుటి వాళ్లకు నీతులు చెప్పే ముందు తన కుటుంబ సభ్యులను ఆదర్శంగా ఉంచేలా చూసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి.
ఇక, రాజకీయంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ను అభిమానిస్తుంటుంది శ్రీరెడ్డి. జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే కౌంటర్ పేల్చుతూ రాజకీయాల్లోనూ వేలు పెడుతుంది ఈ భామ. తనకు వైఎస్సార్ అంటే అమితమైన అభిమానమని.. ఆయన ఆశయ సాధనలో ముందుకు సాగుతోన్న జగనన్న అంటే మరీ ఇష్టమని శ్రీరెడ్డి చెబుతుంది. అందుకే జగన్ ను ఏమైనా అంటే ఊరుకోనని స్పష్టం చేస్తోంది.
అయితే శ్రీరెడ్డి తాజాగా సీఎం జగన్కు చెందిన ఓ పాత ఫొటోను షేర్ చేసింది.తన ఫేస్ బుక్ ఖాతాలో జగన్ కు చెందిన పాత ఫోటోను షేర్ చేసి.. స్టిల్ విత్ యు అన్నా అని క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పటికీ మీతోనే ఉన్నా అన్నా అని కాప్షన్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్గా మారింది.
శ్రీరెడ్డి ఆల్ ఆఫ్ సడెన్గా ఎందుకు ఆ పోస్ట్ పెట్టిందన్నది మాత్రం తెలియడం లేదు.