Sunday, June 5, 2022
HomePoliticsLatest Newsసునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ - టి. కాంగ్రెస్ లో కలకలం

సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ – టి. కాంగ్రెస్ లో కలకలం




తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు మరో సర్వే రిపోర్ట్ ను ఏఐసీసీకి అందించారు. నేతల మధ్య ఐక్యత, అనైక్యత, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఎం చేయాలన్న దానిపై సమగ్రమైన సమాచారాన్ని టెన్ జన్ పథ్ కు చేరవేసినట్లుగా తెలుస్తోంది.

గతంలో సమర్పించిన సర్వేలో కాంగ్రెస్ బలపడుతుందని రిపోర్ట్ ఇచ్చిన సునీల్ కనుగోలు…ఈసారి మాత్రం ఆ ఊపును కంటిన్యూ చేయడంలో పార్టీ వెనకబడిందని తెల్చినట్లుగా తెలుస్తోంది. రేవంత్ పీసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి జోష్ పార్టీలో ప్రస్తుతం లేదని… 19 జిల్లాలో కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో హస్తవ్యవస్తం అవుతుందని సునీల్ కనుగోలు టీం నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం.

ఇటీవల రాహుల్ గాంధీ వరంగల్ టూర్ సక్సెస్ అయిందని… అదే సమయంలో రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో పార్టీ కొంత వెనకబడిందని సర్వే రిపోర్ట్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. రైతు రచ్చబండ పేరుతో రైతు డిక్లరేషన్ ను నాలుగు రోజులు మాత్రమే జనాల్లోకి తీసుకెళ్ళి తరువాత లైట్ తీసుకున్నారని పక్కా రిపోర్ట్ ను ఏఐసీసీకి సునీల్ కనుగోలు అందించినట్లుగా సమాచారం.

అదే సమయంలో వరంగల్, నలొండ, రంగారెడ్డి , ఖమ్మం జిల్లాలో పార్టీ బలీయంగా ఉందని గత సర్వేలో నివేదించిన సునీల్ … తాజాగా సమర్పించిన రిపోర్ట్ లో మాత్రం రంగారెడ్డి జిల్లా మినహా మరో మూడు జిల్లాలో పార్టీ రోజురోజుకు వీక్ అవుతుందని తేలినట్లుగా తెలుస్తోంది. అలాగే, చాలా కాలంగా పెండింగ్ లోనున్న జిల్లా అద్యక్షుల మార్పు ప్రక్రియను స్పీడప్ చేయాలని సూచించారు.

డీసీసీలను మార్చిన చోట మాజీ డీసీసీ లను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టాలని నివేదికలో సూచించారు. నేతల మధ్య ఐక్యత వచ్చినట్లు వచ్చినా అదంతా మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిందని పక్కా సర్వేను ఏఐసీసీకి సునీల్ కనుగోలు అందించినట్లుగా తెలుస్తోంది.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments