Saturday, January 22, 2022
HomePoliticsLatest News'సూపర్ మచ్చి' రివ్యూ

‘సూపర్ మచ్చి’ రివ్యూ

పులి వాసు దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ హీరోగా, రచితా రామ్ హీరోయిన్ గా తెరకెక్కిన సూపర్ మచ్చి చిత్రం సంక్రాంతి కానుకగా శుక్రవారం విడుదలైంది.

రాజు( కళ్యాణ్ దేవ్) చిన్నపాటి సింగర్. రెస్టారెంట్ లో పని చేసే రాజు పాటలు పాడుతూ ఉంటాడు. ఇక, మీనాక్షి ( రచితా రామ్ ) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. రాజును చూడకుండానే అతన్ని ప్రేమిస్తుంది మీనాక్షి. అతనే సర్వస్వం అన్నట్లుగా అమితంగా ప్రేమిస్తుంది. అతని ఊహల్లోనే ఉంటుంది ఎప్పుడు. ఈ నేపథ్యంలోనే రాజు గురించి తెలుసుకొని , తన ప్రేమ విషయాన్నీ చెప్పి అతనితో మూడు ముళ్ళువేయించుకోవాలని పరితపిస్తూ ఉంటుంది. కాని ప్రేమ అంటే ఏంటో పెద్దగా తెలియని రాజు, మీనాక్షిని వదిలించుకోవాలని పలు విధాలుగా ఆమెను ఇబ్బంది పెడుతుంటాడు. ఇంతకీ మీనాక్షి రాజును చూడాకుండానే ప్రేమించడానికి కారణం ఏంటి..? అసలెందుకు రాజును ప్రేమించింది..? చివరికీ మీనాక్షి ప్రేమను రాజు అర్థం చేసుకున్నాడా..? అన్నదే ఈ సినిమా కథ.

హీరోను చూడకుండానే హీరోయిన్ ప్రేమలో పడిపోవడం అనే కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు కథను ఉత్కంటగా మార్చేశాడు. ఇక, ప్రేమ కోసం రచితా రామ్ పడే ఆవేదన అందరి మనస్సులను ద్రవిస్తుంది. హీరోయిన్ గా తన ఫర్ఫామెన్స్ తో మెప్పించింది. ఇక, హీరోగా కళ్యాణ్ దేవ్ మరోసారి ఆకట్టుకున్నాడు. లుక్స్ అండ్ ఫర్ఫామెన్స్ బాగున్నాయి. హీరోయిన్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తాడు., కాని ఆయన ఫర్ఫామెన్స్ కాస్త ఓవర్ గా అనిపిస్తుంటుంది. హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన కమెడియన్స్ భద్రం, జబర్దస్త్ మహేష్, పోసాని తమ కామెడీ టైమింగ్‌ తో నవ్వించారు. మిగిలిన నటినటులు కూడా త పాత్రలకు న్యాయం చేసినప్పటికీ ఈ సినిమాలో అక్కడక్కడ దర్శకుడు లాజిక్ లను మిస్ అయినట్లు కనిపిస్తుంది.

ఓవరాల్ గా.. సినిమా లైన్ బాగానే ఉన్నప్పటికీ అదే లైన్ తో సినిమాను ఆద్యంతం నడిపించడం బోర్ కొట్టిస్తుంది. దీనికితోడు మెయిన్ క్యారెక్టర్స్ ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి కారణాలు ఈ సినిమాకు మైనస్ గా చెప్పొచ్చు. ఇక, సూపర్ మచ్చి చిత్రం చూడాల్సిన సినిమా అయితే కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments