Thursday, June 16, 2022
HomePoliticsLatest Newsటి. కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..!?

టి. కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..!?




తెలంగాణ కాంగ్రెస్ లో ముందస్తు వేడి రాజుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల కూత వినబడనేలేదు. అప్పుడే అభ్యర్థుల జాబితా ఏఐసీసీకి చేరినట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం అందటంతో సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ అందిన జాబితాలో రేవంత్ టీమ్ కు చెందిన నేతలే ఎక్కువ ఉండటంతో… ఈ పని టీపీసీసీ బాస్ జట్టు పనేనని సీరియస్ గా ఉన్నారు. 119నియోజకవర్గాల్లో అభ్యర్థుల లిస్టు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

ములుగులో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క , పెద్దపల్లిలో విజయరమణ రావు, వరంగల్ ఈస్ట్ లో వేం నరేందర్ రెడ్డి, నకిరేకల్ ప్రీతం , గోషామహల్ లో మెట్టు సాయి కుమార్ పేర్లు ఉన్నాయి. ఇక, రేవంత్ కు బలమైన మద్దతుదారుడిగా ఉన్న మల్లు రవికి బదులుగా ఎర్ర శేఖర్ , పరకాలలో కొండా సురేఖ , నర్సంపేటలో దొంతి మాధవ రెడ్డి . పాలకూర్తి నుంచి జంగా రాఘవరెడ్డి , వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి , జనగామ నుంచి పొన్నాల తోపాటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. ఇక, ఖైరతాబాద్ లో మాత్రం దాసోజు శ్రవణ్ పోటీలో ఉంటారని అనుకుంటుండగా… రేవంత్ సమీప బంధువు రోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.

కోదాడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య , కొడంగల్ నుంచి రేవంత్ , నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ , భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ మ్ సాగర్ నుంచి జనా తనయుడికి అవకాశం ఇవ్వనున్నట్టుగా లిస్టు లో ఉంది. సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి లేదా పటేల్ రమేష్ రెడ్డి , తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, దేవరకొండ నుంచి కిషన్ నాయక్ లేదా బాలు నాయక్, పేర్లు ఉన్నాయి. నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్ధన్ రెడ్డి , కొల్లాపూర్ నుంచి డాక్టర్. కేతూరి వెంకటేష్ ( ఓయూ విద్యార్ధి నాయకుడు, బీసీ నేత) , జగదీశ్వర్ రావు , అభిలాష్ రావు పేర్లు ఉన్నాయి. కాని కేతూరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గద్వాల్ నుంచి రాజీవ్ రెడ్డికి , షాద్ నగర్ నుంచి వీర్లపల్లి శంకర్ పేర్లు ఉన్నాయి.

కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్, మంథనిలో శ్రీధర్ బాబు , కామారెడ్డిలో షబ్బీర్ అలీ , సత్తుపల్లిలో మానవతారాయ్, మధిరలో భట్టి విక్రమార్క, ఆందోల్ లో దామోదర రాజనర్సింహ పేర్లు ఉన్నాయి.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments