Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsనిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్...

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్…

టీఆర్ఎస్ సర్కార్ పై నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉంది. తమ అసంతృప్తిని ప్రతి ఉప ఎన్నికల్లోనూ బయట పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఈమేరకు రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది.

వచ్చే బడ్జెట్ లో నిరుద్యోగ భ్రుతి కి నిధులు కేటాయించాలనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకుగాను నిరుద్యోగుల ఓట్లను రాబట్టేందుకు నిరుద్యోగ భ్రుతి పథకం అమలు చేస్తామని ప్రకటించింది టీఆర్ఎస్. అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతుంది కాని నిరుద్యోగ భ్రుతి పథకం అమలు చేయలేదు. దీంతో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు నిరుద్యోగులు ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వారి రూపంలో ముంచుకోస్తున్న ప్రమాదాన్ని పసిగట్టిన టీఆర్ఎస్ అధిష్టానం నిరుద్యోగ భ్రుతి అమలు చేసేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

రాష్ట్ర ఏర్పాటుకు మునుపు ఉమ్మడి పది జిల్లాలో 10 లక్షల మంద నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయినప్పటికీ ఏడాది ఏడాది నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం తెలంగాణలో 35 లక్షల వరకు నిరుద్యోగులు ఉండొచ్చన్నది అధికారుల అంచనా. అయితే ప్రభుత్వం అమలు చేయబోయే నిరుద్యోగ భ్రుతికి ఎలాంటి అర్హతలు ఉండాలని నిర్దేశిస్తుందో. దాని ఆధారంగా లబ్దిదారుల సంఖ్య పెరగడమో, తగ్గడమో జరుగుతోంది. లక్షల మందికి ప్రతి నెల నెలవారీ జీతాలు ఇచ్చినట్లుగా రూ. 3016ఇవ్వడం ఆషామాషీ కాదు. ఇప్పటకే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ సర్కార్ కు ఈ పథకం అమలు ఇబ్బందికరమే కాని అమలు చేయకతప్పని అనివార్యత ఏర్పడింది. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు…? ఎంత బడ్జెట్ కేటాయించాలనే దానిపై ఆర్ధిక శాఖ కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments