Saturday, June 4, 2022
HomePoliticsLatest Newsగవర్నర్ తో కేసీఆర్ రాజీ..!?

గవర్నర్ తో కేసీఆర్ రాజీ..!?




తెలంగాణ గవర్నర్ తో సఖ్యత మెయింటేన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా..? మునుపటి విబేధాలను మనస్సులో పెట్టుకోకుండా గవర్నర్ కు కేసీఆర్ బర్త్ డే విషెస్ వర్తమానం ఇందుకు సంకేతమా..? రాజకీయ రగడ మానేసి కేసీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేయడంపై రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చేంటి.?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, గవర్నర్ తమిళిసై ల మధ్య గ్యాప్ పెరిగింది. ఆమె రాజకీయ అంశాల్లో తలదూర్చుతున్నారని ఆరోపించిన టీఆర్ఎస్ అది మనస్సులో పెట్టుకుందో ఏమో కాని, తన పర్యటనలో ప్రోటోకాల్ పాటించడం లేదని నొచ్చుకున్నారు తమిళిసై. ఆమె పర్యటన సమయంలో జిల్లా మంత్రులు స్వాగతం పలకపోవడం , ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం వంటి పరిణామాలతో కలతచెంది రాష్ట్ర ప్రభుత్వంపై ఏకంగా ఢిల్లీకి ఫిర్యాదు చేశారు తమిళిసై.

తనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని మీడియా ముందుగా ఓపెన్ గానే ప్రకటించారు. దీంతో మంత్రుల నుంచి కూడా రీసౌండ్ గట్టిగానే వినపడింది. ఇలా ప్రగతి భవన్ – రాజ్ భవన్ ల మధ్య వివాదం రోజురోజుకు మరింత పెరుగుతోన్న నేపథ్యంలో గవర్నర్ బర్త్ డే రావడం.. ఆమెకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

కేసీఆర్ , తమిళిసై ల మధ్య నెలకొన్న విబేధాలు ఇంతటితో ముగిసినట్టేనని కొంతమంది అంటున్నా.. అలా అనుకోవడానికి లేదని మరికొంతమంది అంటున్నారు. ఈటల రాజేందర్ బర్త్ డే సమయంలో కూడా కేసీఆర్ విషెస్ చెప్పారని… ఇప్పుడు గవర్నర్ తమిళిసై విషయంలోనూ అదే జరిగిందని అంతే తప్ప…గవర్నర్ తో దోస్తీ ముచ్చట ఉండకపోవచ్చునని అంటున్నారు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments