మా కు ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం రాజీనామా!

మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష స్థానాన్ని కోల్పోయిన ప్ర‌కాశ్ రాజ్… ఓట‌మి పాలైన ఆయ‌న వ‌ర్గంతో రాజీనామాను ప్ర‌క‌టించారు. ఈసీ అభ్య‌ర్థులుగా గెలిచిన 11మంది ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం మా అసోసియేష‌న్ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Prakash Raj resigns from MAA after 21 years; Says pained over being called  outsider | PINKVILLA

త‌మ రాజీనామాల సంద‌ర్భంగా బెన‌ర్జీ ఉద్వేగానికి గుర‌య్యారు. మూడు రోజులుగా త‌ను తీవ్ర బాధ‌లో ఉన్నాన‌ని, వంద‌ల మందిలో త‌న‌ను మోహ‌న్ బాబు అమ్మ‌నా బూతులు తిట్టార‌ని… త‌ను అస‌లు ఎప్పుడూ ఇలా ఒక‌రితో మాట ప‌డ‌లేద‌న్నారు. త‌న‌ను తిడుతున్న స‌మ‌యంలో మోహ‌న్ బాబును ఎవ‌రూ అడ్డుకోలేద‌ని, ఇలాంట‌ప్పుడు మాలో త‌ను ఎందుకు ఉండాల‌ని బెన‌ర్జీ ప్ర‌శ్నించారు.

మాలో తాము కొన‌సాగాలంటే అంద‌రి రాజీనామాల‌ను ఆమోదించ‌టంతో పాటు త‌న మా స‌భ్య‌త్వానికి రాజీనామా వెన‌క్కి తీసుకోవాలంటే బైలా మార్పు చేసే నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని ప్ర‌కాష్ రాజ్ కోరారు.