Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsవాట్సప్ స్టేటస్ లో ప్రేయసి నగ్న వీడియో

వాట్సప్ స్టేటస్ లో ప్రేయసి నగ్న వీడియో

మొదట నీవే ప్రాణమని, నీవు లేకపోతే నేను లేనని సినిమాటిక్ డైలాగ్స్ తో అమ్మాయిలను వలలో వేసుకోవడం కొంతమంది యువతకు పరిపాటిగా మారింది. ఆ తరువాత తాను చెప్పింది చేయలేదని అమ్మాయిల నగ్న చిత్రాలను బయటపెడుతూ భయాందోళనకు గురి చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురానికి చెందన ఓ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన జింకల మహేష్ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. అతడి మాటలను నమ్మిన బాలిక మహేష్ తో శారీరకంగా ఒకటైంది. ఈ క్రమంలోనే నాలుగు నెలల కిందట బాలికకు వీడియో కాల్ చేసి నగ్నంగా కనిపించాలని కోరటంతో ఆమె అలాగే కనిపించింది. అయితే ఈ వీడియోను మహేష్ సేవ్ చేసుకున్నాడు.

ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. తాను చెప్పినట్లు నడుచుకోవాలని కోరడం..అందుకు బాలిక నిరాకరించడం జరిగిపోయాయి. దీంతో ఆగ్రహించిన మహేష్ తాను అంతకుముందు సేవ్ చేసి పెట్టుకున్న వీడియోను వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు. దాని చూసిన పలువురు ఈ విషయాన్ని బాలికకు చెప్పడంతో తన తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులకు కంప్లైట్ చేశారు. నిందుతుడు పరారీలో ఉండటంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments