Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsకేటీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి విసిరినా సవాల్ సమయంలోనే ఆస్క్ కేటీఆర్ పేరుతో చిట్ చాట్ కార్యక్రమంతో సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చారు. కాని దళిత బంధు , కేజీ టూ పేజీ ఉచిత నిర్బంధ విద్య పై పలు ప్రశ్నలను నెటిజన్లు అడగ్గా మంత్రి కేటీఆర్ వాటికి స‌మాధానం ఇవ్వ‌లేద‌ని ఓ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు విమ‌ర్శ‌లు గుప్పించారు.

‘తెలియనిది అడిగితే పాపం మంత్రి కేటీఆర్ ఏమని సమాధానం చెబుతారు? అసలు అడగాల్సింది..మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్ కు బానిసను చెయ్యడం ఎలా? రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేయడం ఎలా?’ ఈ ప్ర‌శ్న‌లు అడ‌గాలని ష‌ర్మిల చుర‌క‌లంటించారు.

దళితులను మోసం చేయడం ఎలా?వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా?ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం ఎలా?ఉద్యమకారులను తొక్కేయడం ఎలా?ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా?పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా? వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు అంటూ సెటైర్లు వేశారు షర్మిల.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments