షర్మిల పాదయాత్ర… తెలంగాణ ఆదరించేనా?

ప్రజా ప్రస్థానం పేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి ప్రజా ప్రస్థానం యాత్ర సాగుతుంది. మొదటి రోజు చేవెళ్లలో లక్ష మంది జనం పాల్గొనేలా భారీ జన సమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ముగింపు సభ కూడా చేవెళ్లలోనే ప్లాన్ చేశారు పార్టీ శ్రేణులు. రాజన్న రాజ్యం, సంక్షేమ పథకాలు అందరికీ అందాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలనే ఎజెండాతో షర్మిల పాదయాత్ర చేపట్టబోతున్నారు.

Telangana: YS Sharmila to launch Padayatra on Oct 18 from Chevella

ఇక, వైఎస్సార్ తెలంగాణ పార్టీకి తొలుత దక్కిన ఆదరణ క్రమేపి తగ్గడంతో షర్మిల పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా ఒకరిద్దరూ కీలక నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పడంతో షర్మిల పార్టీలో ఆదిలోనే లుకలుకలు అనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్టీని మూన్నాళ్ళ ముచ్చ్చటగా కాకుండా చేసేందుకు షర్మిల వైఎస్సార్ టీపీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలని భావిస్తున్నారు. పైగా తెలంగాణలో వైఎస్సార్ కు మంచి గుర్తింపు కూడా ఉంది. ఆ ఓటు బ్యాంక్ ను కూడా షర్మిల క్యాష్ చేసుకుంటే కనుక, కొంతవరకు సక్సెస్ అవొచ్చనే అభిప్రాయాలూ కూడా వినిపిస్తున్నాయి.

YSR Telangana Party chief YS Sharmila to begin her 4,000 km 'padayatra' from Oct 20 - India News

రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించకపోతే మాత్రం.. తెలంగాణ కాంగ్రెస్ లోని వైఎస్ సన్నిహితులు షర్మిల పార్టీలో చేరేవారే. కానీ రేవంత్ కు తెలంగాణ సారధ్య బాధ్యతలను కట్టబెట్టడంతో చాలామంది షర్మిల పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నారు. కాంగ్రెస్ లోని చాలామంది తన వెంట కలిసి వస్తారని ఊహించిన షర్మిలకు రేవంత్ రూపంలో శరాఘాతమే ఎదురైంది.